I promise to myself !

·

·

                   వాగ్దానం చేస్తున్నాను

నా మనశ్శాంతిని ఏ శక్తీ దూరం చేయలేనంత బలంగా నేను ఉంటాను.
నేను కలిసే ప్రతి ఒక్కరితో ఆరోగ్యం, ఆనందం, మరియు ప్రగతి గురించే మాట్లాడతాను.
ప్రతి విషయంలోనూ మంచి వైపునే చూస్తూ, నా నమ్మకాన్ని నిజం చేసుకుంటాను.


ఎప్పుడూ అత్యుత్తమంగా ఆలోచిస్తూ, ఉత్తమమైన దాని కోసమే శ్రమిస్తూ, మంచి జరుగుతుందనే ఆశిస్తాను.
నా విజయానికి ఎంతలా మురిసిపోతానో, ఇతరుల విజయాలను కూడా అంతే ఉత్సాహంతో అభినందిస్తాను.
నా స్నేహితులు, కుటుంబ సభ్యులలోని గొప్పదనాన్ని వారు గుర్తించేలా ప్రవర్తిస్తాను.


గతంలో జరిగిన పొరపాట్లను వదిలేసి, భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాల వైపు అడుగులు వేస్తాను.

ఎల్లప్పుడూ ముఖంపై చిరునవ్వు చెరగనివ్వను, నేను కలిసే ప్రతి ఒక్కరికీ ఆ నవ్వును పంచుతాను.


నన్ను నేను మార్చుకోవడానికే నా సమయాన్నంతా కేటాయిస్తాను, ఇతరులను విమర్శించేందుకు నాకు అసలు సమయమే ఉంచను.


దిగులు పడనంత ధైర్యంగా, కోపానికి లొంగనంత సంస్కారంగా, భయపడనంత బలంగా, ఏ సమస్యా దరిచేరలేనంత సంతోషంగా జీవిస్తాను.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *